Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి సేవలు మరువలేనివి

ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి సేవలు మరువలేనివి

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్ 
సమాజ మార్గదర్శనికులు ఉపాధ్యాయులేనని రాబోయే తరాలకు బంగారు భవిష్యత్ ను అందించాలన్న ఉపాధ్యాయులతోనే సాధ్యమవుతుందని, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని జిల్లా సెక్టోరియల్ అధికారి రామస్వామి మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండలం బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గుజ్జుల అంజిరెడ్డి ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర ఎనలేనిదని ప్రభుత్వ ఉద్యోగులలో అందరికంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రత్యేక గౌరవం ఉంటుందన్నారు.సమాజాన్ని నిర్మించాలంటే ఉపాధ్యాయుల చేతనే అవుతుందన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కత్తిపోటు తప్పిన కలంపోటు తప్పదన్నారు.

గ్రామస్థాయి వార్డు సభ్యుల నుంచి ప్రధాన మంత్రి, రాష్ట్రపతి వరకు క్లర్క్, అటెండర్ స్థాయి నుంచి అత్యున్నత పదవులు ఐఏఎస్, ఐపీఎస్ పదవుల వరకు ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుల చేత విద్యనభ్యసించినవారేన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు జన్మనిస్తే విద్య, విజ్ఞానం, క్రమశిక్షణ వినయం జీవితంలో ఉన్నతంగా బతికేస్థాయి విలువలు అన్నీ కూడా ఉపాధ్యాయులే నేర్పిస్తారు. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో గుజ్జుల అంజిరెడ్డి ఎంతో అన్యోన్యతగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో స్నేహశీలిగా ఉంటూ ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చారు. తన పదవి కాలంలో ఎంతో మంది విద్యార్థులకు విద్యాబోధన చేసి ఎంతో మంది విద్యార్థులు ప్రయోజకులు చేశారు.

ఉద్యోగులకు బదిలీలు, పదవి విరమణలు తప్పనిసరిగా ఉంటాయని వారి శేషా జీవితాన్ని సమాజ నిర్మాణం కోసం సమయానికి వెచ్చించాలని విజ్ఞప్తి చేశారు. బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అందించిన సేవలను ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ రంగనాథ్, ఎంఈవోలు గజ్జల కనకరాజు, వెంకట రాములు, ఉదయ్ భాస్కర్, మాధవరెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ రెడ్డి, నిర్మల, నాగరాజు, సుధాకర్ రెడ్డి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణం, హరిహర ప్రసాద్,సిఆర్పిలు యాదగిరి, స్వామి, ఎల్లా గౌడ్ మాజీ సర్పంచులు ప్రవీణ్, లచ్చయ్య, బిజెపి మండలాధ్యక్షులు మంకిడి స్వామి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -