Tuesday, December 2, 2025
E-PAPER
Homeకరీంనగర్ఉన్నత పాఠశాలకు ప్రింటర్ వితరణ..

ఉన్నత పాఠశాలకు ప్రింటర్ వితరణ..

- Advertisement -

నవతెలంగాణ – వీర్నపల్లి 
వీర్నపల్లి మండలం గర్జనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు, గ్రామానికి చెందిన ఉద్యోగులు రూ.20 వేల విలువైన ఒక కలర్ ప్రింటర్‌ ను విరాళంగా ఇచ్చారు. పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ప్రింటర్‌ ను ప్రధానోపాధ్యాయుల కు అందజేశారు. ఈ సందర్భంగా రాకేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్, మూత్రశాలలు, స్కావెంజర్ సేవలు, ఆధునిక గదులు వంటి మౌలిక వసతులను కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ పరిధిలో లేని మరిన్ని అవసరాలను తాము తీరుస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంగల శ్రీనివాస్, కమిటీ సభ్యులు గజ్జెల ప్రశాంత్, న్యాత రాజశేఖర్, ఉపాధ్యాయులు కూలేరి ప్రేమ్ సాగర్, రవి నాయక్, మంజుల, కవిత హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -