Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యతను ఇవ్వాలి

పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యతను ఇవ్వాలి

- Advertisement -

– పిసిసి అధ్యక్షుడు, మంత్రులను కలిసి విన్నపం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని హాసాకొత్తూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పడాల మల్లేష్, పాలెపు రాజేశ్వర్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క లను కలిసి వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పడాల మల్లేష్, పాలెపు రాజేశ్వర్ మాట్లాడుతూ గత 2017 నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ, పార్టీ బలోపేతం కొరకు ముఖ్య పాత్ర వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపులో బాల్కొండ నియోజకవర్గం నుండి కీలకంగా పని చేసి మెజార్టీ తెచ్చేలా కృషి చేశామని తెలిపారు.

కానీ బాల్కొండ నియోజకవర్గ, కమ్మర్ పల్లి మండల స్థానిక నాయకులు ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇందిరమ్మ కమిటీలో స్థానం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బి-ఫామ్ లు అందేలా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్లమైన మేము ఇదేంటి అని అడిగితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా 2017నుండి పార్టీకి పనిచేసిన వారిని గుర్తించి, ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో చోటు, బి ఫామ్ లు, పదవులు వచ్చేలా చూడాలని కోరారు. పార్టీ అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్నా సీనియర్లకు న్యాయం చేస్తూ పార్టీలో స్థానికంగా కలహాలు లేకుండా చూడాలని కోరుతూ పలు అంశాలపై వినతి పత్రం పిసిసి అధ్యక్షుడు, మంత్రులకు వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన సీనియర్లకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని విన్నవించినట్లు తెలిపారు. పిసిసి అధ్యక్షుడు, మంత్రులను కలిసిన వారిలో ఈగ మధుసూదన్, పొడేటి ధర్మయ్యా, ధనరాజ్, సురేష్, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -