– అపరాధ రుసుం విధింపు
– జే.ఎఫ్.సీ.ఎం కోర్ట్ తీర్పు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీస్ లకు దొరికిపోయిన ముగ్గురికి మూడు రోజులు జైలు శిక్ష తో పాటు రూ.1 వేయి చొప్పున అపరాధ రుసుం విధిస్తూ దమ్మపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి భవాని శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడిన మొత్తం 9 మందిని విచారించి కోర్టులో హాజరు పరచగా అందులో ముగ్గురికి మూడు రోజుల పాటు జైలు శిక్ష , ఒక్కొక్కరికి రూ.1 వెయ్యి చొప్పున జరిమానా విధించి సత్తుపల్లి సబ్ జైలుకి రిమాండ్ నిమిత్తం తరలించారు.మరో ఆరుగురు వ్యక్తులకు రెండు రోజుల కమ్యూనిటీ సర్వీస్ తోపాటు ఒక్కొక్కరికి రూ.500 లు చొప్పున జరిమానా విధించినట్లు స్థానిక ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.



