Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలతో ప్రయివేటు పాఠశాలలు పోటీపడాలి 

ప్రభుత్వ పాఠశాలలతో ప్రయివేటు పాఠశాలలు పోటీపడాలి 

- Advertisement -

పైపుల రాజిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి 
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

ప్రభుత్వ పాఠశాలలతో ప్రయివేటు పాఠశాలలు పొటి పడే విధంగా ఉండాలని నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పైపుల రాజిరెడ్డి కాంస్య విగ్రహాన్ని నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హైస్కూల్లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ గడ్డం పైపుల రాజిరెడ్డి కోట్ల రూపాయలతో హైస్కూల్ నిర్మించడం తొ జక్రం పెళ్లి గ్రామ ప్రజల్లో నిలిచిపోయారని అన్నారు.

ఆయన నిర్మించిన హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులు అదరూ సక్రమంగా చదువుకుని పారిశ్రామికవేత్తలు ఇంజనీర్లు డాక్టర్లు కావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను చూసి ప్రైవేటు పాఠశాలలు పోటీ పడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు రెడ్డి కూతురు, డాక్టర్ సుభాష్, ఎం ఈ ఓ శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయి రెడ్డి, మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -