Monday, January 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రయివేటు ట్రావెల్స్ దోపిడి

ప్రయివేటు ట్రావెల్స్ దోపిడి

- Advertisement -


నవతెలంగాణ హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందడి మొదలవ్వకముందే ప్రయివేటు ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికులపై ధరల బాదుడు మొదలుపెట్టాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణంగా రూ.700 ఉండే ఛార్జీని పండుగ సాకుతో రూ.4,000 వరకు పెంచినట్టు సమాచారం. రైళ్లలో బెర్తులు దొరకకపోవడంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఈ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు వెంటనే స్పందించి, బస్సుల ఫిట్‌నెస్‌తో పాటు ఛార్జీలపై కఠిన తనిఖీలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -