- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాం స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అస్సాంతో పాటు కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లకు కూడా స్క్రీనింగ్ కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు అభ్యర్థుల ఎంపిక, అంతర్గత సంప్రదింపులు వంటి బాధ్యతలను నిర్వహిస్తాయి.
- Advertisement -



