నవతెలంగాణ – కామారెడ్డి
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్త్ టాలెంట్ టెస్ట్‌లో విజేతలకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎంఈఓ ఎల్లయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు నితిన్, పట్టణ కార్యదర్శి రాహుల్, శ్రీ సాందీపని విద్యాసంస్థల వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



