Monday, September 15, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంన్యూజిలాండ్‌లో పాలస్తీనా అనుకూల ప్రదర్శన

న్యూజిలాండ్‌లో పాలస్తీనా అనుకూల ప్రదర్శన

- Advertisement -

ఆక్లాండ్‌ : న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నగరంలో శనివారం వేలాది మంది పాలస్తీనా అనుకూల ప్రదర్శన నిర్వహించారు. గాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద ప్రదర్శన జరగడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలి పారు. సెంట్రల్‌ ఆక్లాండ్‌లో జరిగిన ఈ మానవతా ర్యాలీకి యాభై వేల మంది హాజరయ్యారు. 2023 అక్టోబరులో గాజాలో ఘర్షణ ప్రారంభమైన తర్వాత జరిగిన భారీ ర్యాలీ ఇదేనని ప్రదర్శనకు నేతృత్వం వహించిన అయోటెరోవా ఫర్‌ పాలస్తీనా సంస్థ ప్రతినిధి ఆరామ రత్న చెప్పారు. ప్రదర్శకులలో చాలా మంది పాలస్తీనా పతాకాలు, బ్యానర్లు పట్టుకొని ‘మారణహోమాన్ని కొనసాగించొద్దు’, ‘పాలస్తీనా అనుకూల వైఖరిని అవలంబించండి’ అంటూ నినాదాలు చేశారు. నగరంలోని ఓ బ్రిడ్జిని మూసివేయాలని నిర్వాహకులు తొలుత భవించినప్పటికీ బలమైన గాలుల వీయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ర్యాలీ సందర్భంగా అరెస్టులేవీ జరగలేదని పోలీసులు తెలిపారు. న్యూజిలాండ్‌ ప్రభుత్వం ఇజ్రాయిల్‌పై ఆంక్షలు విధించాలని అయోటెరోవా ఫర్‌ పాలస్తీనా సంస్థ డిమాండ్‌ చేసింది. గాజాలో ఇజ్రాయిల్‌ చర్యలను న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టొఫర్‌ లెక్సాన్‌ గత నెలలో ఖండించారు. పాలస్తీనా దేశాన్ని గుర్తించే విషయాన్ని పరిశీలిస్తున్నామని న్యూజిలాండ్‌ విదేశాంగ మంత్రి విన్‌స్టన్‌ పీటర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. కాగా ఇజ్రాయిల్‌పై ఆంక్షలు విధించాలన్న డిమాండ్‌ను న్యూజిలాండ్‌ యూదు మండలి ఖండించింది. న్యూజిలాండ్‌లో నివసిస్తున్న పది వేల మంది యూదులకు ఈ మండలి ప్రాతినిధ్యం వహిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -