ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి…
30 సంవత్సరాల క్రితం కట్టిన ట్యాంకుకు నల్ల కలెక్షన్ ఇవ్వలేదు..
కొరటికల్ కు బస్సు సౌకర్యం లేక ప్రజలు బాధపడుతున్నారు..
సీపీఐ (ఎం) పోరాటాలు ఎల్లప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాయి..
సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం..
నవతెలంగాణ-మునుగోడు: పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపుతున్నప్పుడు ప్రజా పోరాటాలు నిర్వహించినప్పుడే ప్రభుత్వాలు దిగివచ్చి ప్రజా సమస్యలను పరిష్కరిస్తాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా మండలంలోని గూడపూర్ , కొరటికల్ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో సంవత్సరాల తరబడి సమస్యలతో గ్రామాలలో ప్రజలు అవస్థలు పడుతుంటే పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.గూడపూర్ గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ఓహెచ్ ఆర్ ట్యాంక్ నిర్మించారు కానీ , నీటిని నిల్వ చేసేందుకు కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా మారింది అని గ్రామ ప్రజలు తెలిపారు. బీరప్ప గుడి నుండి స్మశాన వాటిక స్థలం మీదుగా పైప్ లైన్ నిర్మాణం చేపడితే ట్యాంకి నిరుపయోగంగా ఉండకుండా వినియోగంలోకి వస్తుందని గ్రామ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. కొరటికల్ గ్రామంలోని ప్రజలు వివిధ అవసరాలకు వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నల్గొండ నుండి కొరటికల్ మీదుగా చండూరుకు పల్లె వెలుగు బస్సును నడిపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కొరటికల్ , గూడపూర్ గ్రామాలలో పలు వీధులలో సీసీ రోడ్లు మురికి కాలువలు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు సీపీఐ (ఎం) ఇంటింటి సర్వే లో పాల్గొన్న సభ్యులు ప్రజలు తమ గోడును వెలబోసుకుంటున్నారు . ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టే ఇంటింటి సర్వేలో సిపిఎం పోరాటాలు ఎల్లప్పుడు ప్రజల పక్షాన ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు . ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఎర్రజెండా వేగుచుక్కయి ఉద్యమాలకు ఊపిరి పోస్తుందని అన్నారు . ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యులు పగడాల కాంతయ్య , డోలు దెబ్బ వ్యవస్థాపకులు మాల్గా యాదయ్య , తదితరులు ఉన్నారు.