Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

– ఖమ్మం నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ(ఎం) భారీ ధర్నా
– వేలాదిగా దరఖాస్తుల సమర్పణ
– సంక్షేమం, అభివృద్ధి ఫలాల కోసం డిమాండ్‌
– కార్పొరేషన్‌ అధికారులకు సీపీఐ(ఎం) విజ్ఞప్తి
– సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం : పోతినేని
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

తమ సమస్యలు పరిష్కరించా లంటూ వివిధ పథకాల దరఖాస్తు దారులు శనివారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ ధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ కమిషనర్‌ షఫీవుల్లాఖాన్‌ బయటకు వచ్చి దరఖాస్తులు తీసుకోవటంతోపాటు సీపీఐ(ఎం) చేసిన సర్వేలో వెలుగు చూసిన సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు మేయర్‌ పునుకొల్లు నీరజకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్‌ కార్యదర్శి వై.విక్రం అధ్యక్షతన జరిగిన ధర్నాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు ఇండ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు, వివిధ పథకాల కోసం దరఖాస్తులు పెట్టడంతోనే ప్రభుత్వం కదలదని, పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పేరుతో పదేండ్లు సాగదీసిందని, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాల కోసం అదే ధోరణి అవలంబిస్తోందని అన్నారు. గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పోతే సమస్యలు పరిష్కారం కావని, ఫోర్త్‌ సిటీ, మూసీ సుందరీకరణ, అందాల పోటీలకు ఉన్న డబ్బులు ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి లేవా? అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రశ్నిం చారు. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, పింఛన్ల పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, మాదినేని రమేష్‌, సీనియర్‌ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, డివిజన్‌ కమిటీ నాయకులు నాగుల్‌ మీరా, బోడపట్ల సుదర్శన్‌, ఉపేందర్‌, నాగసులోచన, వజినేపల్లి శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బషీర్‌, కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad