- Advertisement -
నవతెలంగాణ-రాయికల్: మండలంలోని అల్లీపూర్ రైతు ఉత్పత్తి దారుల కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిలువల రిజిస్టర్ ను పరిశీలించారు. తుఫాన్ ప్రభావం ఉన్నందున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని,కొనుగోళ్లు వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ పరిశీలనలో ట్రైని కలెక్టర్ కన్నం హరిణి, చైర్మన్ అత్తినేని శంకర్, డైరెక్టర్ రత్నాకర్ రావు, కార్యదర్శి రాకేష్, రాజేష్, రైతులు, అధికారులు ఫాల్గొన్నారు.
- Advertisement -



