Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeసినిమాషరతులతో వేతనాల పెంపుకు నిర్మాతలు ఓకే

షరతులతో వేతనాల పెంపుకు నిర్మాతలు ఓకే

- Advertisement -

షరతుల మేరకు సినీ కార్మికుల వేతనాలను పెంచేందుకు నిర్మాతలు సుముఖంగా ఉన్నట్లు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌ తెలిపారు.
శనివారం నిర్మాతలతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘వారం రోజులుగా జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. రోజుకు రూ.2 వేల కన్నా తక్కువ తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచాలని నిర్ణయించాం. మొదటి సంవత్సరం 15 శాతం, రెండో సంవత్సరం 5 శాతం, మూడో సంవత్సరం 5 శాతం పెంచుతాం. అలాగే రూ.1000 కంటే తక్కువ వేతనం ఉన్న వాళ్లకు నేరుగా 20 శాతం వెంటనే పెంచుతాం. రెండో సంవత్సరం ఎలాంటి పెంపూ ఉండదు. మూడో ఏడాది వారికి 5 శాతం పెంచుతాం. బడ్జెట్‌ పరంగా చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయి. మేం ఫెడరేషన్‌ ముందుకు నాలుగు షరతులు పెట్టాం. అవి ఒప్పుకుంటే ఈ పెంపు వెంటనే అమలవుతుంది. చిన్న సినిమా అంటే ఎంత బడ్జెట్‌ అనే దానిపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. అందరూ కలిసి చర్చించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి. అర్హత కలిగిన కార్మికులకు తగిన వేతనం ఇవ్వాలన్నదే మా అభిప్రాయం. ప్రస్తుతం రోజుకు నాలుగైదు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి వేతనాలు పెంచమనటం సరికాదు’ అని తెలిపారు.
తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు : చిరంజీవి
‘నా దష్టికి వచ్చిన విషయం ఏమిటంటే ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచు కున్నాను. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. ఏ వ్యక్తిగతంగా అయినా, నేను సహా, ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్‌ ఛాంబరే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయ సమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్‌ ఛాంబర్‌ సమిష్టి బాధ్యత. అంతవరకు, అన్ని పక్షాల్లో గందరగోళం సష్టించే ఉద్దేశ్యంతో చేసిన ఇలాంటి నిరాధారమైన, ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి.’

మేం అంగీకరించం : ఫెడరేషన్‌ నాయకులు
మరో వైపు నిర్మాతలతో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నాయకుల చర్చలు విఫలమయ్యాయి. వేతనాల పెంపు విషయంలో నిర్మాతల నిర్ణయాలను, షరతులను అంగీకరించేది లేదని ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ తేల్చి చెప్పారు. ఫెడరేషన్‌ను విభజించేలా, యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా నిర్మాతల నిర్ణయాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. అసలు మాతో చర్చించని చాలా విషయాలను మేం అంగీకరించినట్టు మీడియాలో చెప్పి గందరగోళం సృష్టిస్తున్నారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా పెంచాలని డిమాండ్‌ చేశారు. నిర్మాతలు, ఫిల్మ్‌ఛాంబర్‌తో జరిగిన చర్చల వివరాలను నేడు (ఆదివారం) అన్ని యూనియన్ల సభ్యులకు తెలియజేసి, వారి సూచనలతో మా నిరసనను తెలియజేసేలా మరింత ఉధృతంగా ఆందోళన చేస్తామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img