Friday, December 5, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రొఫెసర్ కార్లోస్‌ పోర్చుగల్‌ గౌవేయా అరెస్ట్

ప్రొఫెసర్ కార్లోస్‌ పోర్చుగల్‌ గౌవేయా అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హార్వర్డ్‌ లా స్కూల్‌ విజిటింగ్‌ ప్రొఫెసర్‌ కార్లోస్‌ పోర్చుగల్‌ గౌవేయాను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేసినట్లు యుఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ గురువారం తెలిపింది. మసాచుసెట్స్‌లోని యూదుల ప్రార్థనా మందిరం వెలుపల పెల్లెట్‌ తుపాకీని వినియోగించినట్లు ఆయన నేరాన్ని అంగీకరించిన అనంతరం ఈ అరెస్ట్‌ జరిగినట్లు వెల్లడించింది.

బ్రెజిలియన్‌కి చెందిన కార్లోస్‌ పోర్చుగల్‌ గౌవేయాను బుధవారం అమెరికా ఇమ్మిగ్రేషన్‌ మరియు కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అరెస్ట్‌ చేసినట్లు యుఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు తెలిపారు. ఆయన తాత్కాలిక నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాను అమెరికా విదేశాంగ రద్దు చేసినట్లు వెల్లడించారు. సావోపాలో యూనివర్శిటీ న్యాయ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గౌవేయా, హార్వర్డ్‌లో సెమిస్టర్‌ బోధన కోసం నియమితులయ్యారని, ఆయన దేశం విడిచి వెళ్లేందుకు అంగీకరించారని హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది.

యూదుల సెలవుదినం యోమ్‌ కిప్పుర్‌ సందర్భంగా బెత్‌ జియాన్‌ సమీపంలో ఒక వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిందని, అక్టోబర్‌1న గౌవేయాను అరెస్ట్‌ చేసినట్లు మసాచుసెట్స్‌లోని బ్రూక్‌లైన్‌లోని పోలీసులు తెలిపారు. అయితే ఆసమయంలో గౌవేయా నేరాన్ని అంగీకరించేందుకు నిరాకరించడంతో ఆయనపై పలు అభియోగాలు నమోదయ్యాయని అన్నారు. పెల్లెట్‌ గన్‌ను చట్టవిరుద్ధంగా ప్రయోగించిన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు గత నెల ఆయన పోలీసులకు తెలిపారు. ఆరు నెలల ముందస్తు విచారణకు కూడా ఆమోదం తెలిపారు. దీంతో ఒప్పందంలో భాగంగా ఆయనపై గతంలో నమోదు చేసిన అభియోగాలను కొట్టివేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -