- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ చందానగర్ లో సంచలనం సృష్టించిన ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు కొంత పురోగత సాధించారు. పటాన్ చెరు రోడ్ పై వెళుతున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్నారు. వీరంతా రెండు బైక్ లపై పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. ముఖాలకు మాస్క్ లు, తలకు క్యాప్ లు, చేతులకు గ్లౌజులు ధరించి ప్రయాణిస్తుండటంతో వీరి కదలికలు పోలీసులకు అనుమానం కలిగించారు. వీరు ప్రయాణిస్తున్న బైకులు కూడా దొంగిలించినవేనని పోలీసులు గుర్తించారు. ఈ ఆరుగురిని పోలీస్ స్టేషన్ కు తరలించి, వారిపై కేసు నమోదు చేశారు. ఈ దోపిడీ వెనుక ఉన్న వ్యక్తల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Advertisement -