Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ తోనే ప్రగతి సాధ్యం 

కాంగ్రెస్ తోనే ప్రగతి సాధ్యం 

- Advertisement -

-కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 
-ఆమనగల్ లో కాంగ్రెస్ ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే 
నవతెలంగాణ-ఆమనగల్

కాంగ్రెస్ తోనే పల్లెల్లో ప్రగతి సాధ్యమవుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆమనగల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అద్భుత ప్రగతి సాధించాయని గుర్తు చేశారు. అర్హులైన నిరుపేదలకు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. గిరిజనుల సంక్షేమం, తాండాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు.

ప్రజా విశ్వాసం కోల్పోయి అధికారానికి దూరమైన బీఆర్ఎస్ నాయకులు పంచాయతీ ఎన్నికల్లో తమ ఉనికి కోసం సాగిస్తున్న కుట్రలను కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం శంకర్ కొండ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి మండ్లి రాములు, మేడిగడ్డ తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి రాజేశ్వరి మల్లేష్ నాయక్, చింతలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కొప్పు శ్రీశైలం తదితరులకు ఎమ్మెల్యే నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనిత విజయ్, మాజీ మార్కెట్ వైస్ చైర్మెన్ గుర్రం కేశవులు, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు జగన్, మానయ్య, నాయకులు శంకర్ నాయక్, ప్రసాద్, నాజర్, మోతిలాల్, రాఘవేందర్, వెంకట్ రెడ్డి, అలీం, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -