నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి.పట్టాభిరామ్ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. ఖైరతాబాద్ లోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని ఉంచారు. అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఉంచనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగను న్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన’రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారా యణ సంతానంలోని 15 మందిలో బివి.పట్టాభిరామ్ ఒకరు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్‌రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యను నేర్చుకున్నారు. ఆయన ఇంద్రజాలికుడిగా, సైకాలజీస్టుగా సమాజా నికి సేవలందించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలా సఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. యోగా, హిప్నోటిజంలో పీహెచ్‌డీ చేశారు. భారత ఆహార సంస్థలో ఆయన ఉద్యోగిగా విధులు నిర్వహించారు. మానసిక వైద్యుడిగానూ ప్రసిద్ధి చెందారు. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. ఆయన భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలే.
సీఎం రేవంత్ సంతాపం
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంద్రజాలికుడు, రచయిత డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మరణం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇంద్రజాల విద్య ద్వారా మూఢ నమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తన ఇంద్రజాల విద్య ద్వారా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేసిన పట్టాభిరామ్ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES