Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

- Advertisement -

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు 
నవతెలంగాణ – గోవిందరావుపేట 

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్ పి సీ నాయకులు చాప బాబు దొర,రెడ్డి వాసుదేవ రెడ్డి హాట్కార్ సమ్మయ్య తోలేం లక్ష్మయ్య బి శ్యాంసుందర్ రెడ్డి కొర్ర రఘురాం ల ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ చల్వాయి గౌట్ హైస్కూల్ గోవిందరావుపేట నందు  దశల వారి కార్యక్రమాలో భాగముగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చాప బాబు దొర మాట్లాడుతూ కొన్ని ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ విద్యకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పి ఆర్ సి ని 51 శాతం ప్రకటించి వెంటనే అమలు చేయాలని పెండింగ్లో ఉన్న అన్ని  సమస్యలను పరిష్కారం చేయాలని పలుమార్లు కోరినప్పటికిని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి వాసుదేవ రెడ్డి గారు మాట్లాడుతూ కేజీబీవీలకు మోడల్ స్కూల్ లకు వేతనాలను పెండింగ్లో పెట్టకుండా జీరో వన్ జీరో ద్వారా వారి వేతనాలను విడుదల చేసే విధంగా ప్రభుత్వ కృషి చేయాలని మరియు వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దివాకర్  ఎంఎన్ఓ కే. సోమిరెడ్డి  ఎస్. చంద్ర రెడ్డి   ఆంగ్లము మరియు హిందీ స్కూల్ కాంప్లెక్స్ లో పాల్గొన్న వివిధ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నరు ఆగస్టు 1న జరిగే ధర్నా బదులుగా ఆగస్టు 5న ప్రతి జిల్లా కేంద్రాలలో జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు కృషి చేయాలని అందరు మద్దతు తెలపాలని తెలియజేయడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -