Monday, September 1, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతాయి

పదోన్నతులు పోలీసులకు మరింత బాధ్యతను పెంచుతాయి

- Advertisement -

– పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి
–  నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి

– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర 
నవతెలంగాణ –  కామారెడ్డి 
పోలీస్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన నలుగురు పోలీసులను అభినందించి, పదోన్నతి చిహ్నాలను  జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర వారికి అలంకరించారు. బి. వెంకటేశ్వర్లు, నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్, ఎస్. రమేష్ గౌడ్, తాడ్వాయి పోలీస్ స్టేషన్,  జి. శ్రీనివాస్, బీర్కూర్ పోలీస్ స్టేషన్, డి. దామోదర్ – (రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి కామారెడ్డికి వచ్చారు ) పదోన్నతి పొందిన పోలీసులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర ఐపీఎస్  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ  పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పదోన్నతులు బాధ్యతను మరింత పెంచుతాయి. పదోన్నతులు పొందిన సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. ప్రజల సేవలో నిజాయితీగా పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుంది. సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్లు లభిస్తాయి  అని తెలిపారు. పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్‌లు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ, తమపై విశ్వాసం ఉంచిన ఉన్నతాధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad