Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రచార అస్త్రం.. సోషల్ మీడియా

ప్రచార అస్త్రం.. సోషల్ మీడియా

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
గ్రామాలలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఆశావాహులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. రోడ్ల వెంట వెళ్లే వారిని సైతం పలకరిస్తూ వారికి ఏ అవసరం ఉన్న తీరుస్తూ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుని పనిలో పడ్డారు. ఏ అవకాశం దొరికిన తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.   సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది సామాజిక మాధ్యమాలే వేదికగా ఎన్నికల ప్రచార హోరు ఊపండుకుంటుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్నారని ఇంతకుముందే ఎన్నికల్లో నాయకుల హామీలపై నిష్టూరపడేవారు. ఆ విషయం పక్కన పెడితే నేడు ఎన్నికల ప్రక్రియనే అరచేతిలో ఇమిడిపోతుంది. సౌకర్యవంతం పారదర్శకతకు వేదికగా నిలిచిన అంతర్జాలం ప్రపంచంలో భాగమైంది. నేడు ఫోను లేని వ్యక్తి లేడు.

సోషల్ మీడియా యాప్స్ లేని స్మార్ట్ ఫోన్లు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుందో క్షణాల్లో అరచేతిలో ప్రత్యక్షమవుతున్న కాలమిది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు మూస ధోరణి ప్రచార విధానాలకు స్వస్తి పలుకుతున్న తరుణం. ఓటర్లను ఆకట్టుకోవడానికి అరచేతిలోనే మొబైల్ ఆయుధాన్ని వినియోగించుకుంటున్నారు. సామాజిక మధ్యమాలపై పట్టు ఉన్న నాయకులు తామే స్వయంగా ఖాతాలను నిర్వహిస్తుండగా, మరికొందరు నాయకుల ఖాతాలను ప్రధాన అనుచరులు నిర్వహిస్తున్నారు. చిత్రాలు వీడియోలు , ప్రచారం ప్రత్యర్థులపై విమర్శలు, కౌంటర్లు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. 

సమాచార వ్యూహం..
ఓటర్లను ఆకట్టుకోవడానికి రూపొందించే సమాచారంలో సృజనాత్మకతను జోడిస్తున్నారు. ఓటర్లు తమకు అనుకూలంగా మారడానికి అవసరమైన సమాచారాన్ని జోడించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. 

వెబ్ సైట్లు..
అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక ఏ సమాచారం తెలుసుకోవాలన్న సులువు అయిపోయింది ఈ నేపథ్యంలో ఓటర్లు సైతం వెబ్సైట్ ల ద్వారా కొంత సమాచారం తెలుసుకోవాలని వివరిస్తున్నారు .అభ్యర్థుల గురించి పార్టీల ఎజెండా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు ప్రత్యేకంగా వెబ్సైట్లు రూపొందించుకుంటున్నారు. 

యాప్స్..
స్మార్ట్ ఫోన్ల యుగంలో అంతా యాప్ల మాయమైపోతుంది. రాజకీయానికి మేకప్ నాకు ఇలా ప్రతిదీ యాప్ ల రూపంలో ప్రజలను ఆకట్టుకుంటుంటే పార్టీలు సైతం యాప్లు రూపొందించి ఓటర్లను చేరుకోవడానికి ఎత్తిరిస్తున్నారు వాటి ద్వారా ఎన్నికల ప్రచార కటౌట్  సైతం రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇలా సోషల్ మీడియాను ఎక్కువగా అంటిపెట్టుకొని యువ ఓటర్లను ఆకర్షించే దిశగా పార్టీల వ్యూహాలు నేడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇంటర్నెట్ వాడకం తెలియని నాయకులు సైతం సామాజిక మధ్యమాల ద్వారా ప్రసంగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీలతో పాటు గ్రామాలలో యువ నాయకులు సోషల్ మీడియాను ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారు. 

కూర్చున్న చోట నుంచే..
కంప్యూటర్లు ,లాప్టాప్, స్మార్ట్ ఫోన్లలో కూర్చున్న చోటు నుంచి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నడిపించే సాధనాలు అందుబాటులో ఉన్నవి. అయితే ఎన్నికలలో మాత్రం ఓటర్లు నిస్వార్థపు సేవలందించే వారిని, స్వలాభం, అధికారం డబ్బే పరమావధిగా  పనిచేసే నాయకులకు బుద్ధి చెప్పాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -