అటవీ శాఖ జిల్లా అధికారి నవీన్ రెడ్డి..
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో శుక్రవారం అటవీ శాఖ జిల్లా అధికారి నవీన్ రెడ్డి పర్యటించారు. కాటారం రేంజ్ పరిధిలోని ప్రతాపగిరి గుట్ట అటవీ ప్రాంతంలో రోడ్డు, కల్వర్టులు, నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండేందుకు వాటర్ ట్యాంకులు సోలార్ విద్యుత్తు పరికరాలు సమకూర్చేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా సందేహాలు ఉంటే తెలుపాలని అధికారులను కోరారు. ఆయన వెంట మహాదేవపూర్ డివిజన్ అటవీశాఖ అధికారి సందీప్, ఎఫ్ ఆర్ ఓ స్వాతి, డివై ఆర్ఓ సురేందర్, డిఆర్ఓ శ్రీనివాస్, ఎఫ్ ఎస్ ఓ చంద్రశేఖర్, బీట్ ఆఫీసర్లు మొయినుద్దీన్, రాజేందర్, అశోక్ సంజీవ్, బేస్ క్యాంప్ సిబ్బంది అంకుష్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ ప్రాంత అభివృద్ధికి ప్రతిపాదన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES