Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పౌర హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి భాధ్యత...

పౌర హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి భాధ్యత…

- Advertisement -

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు …. బర్రె సుదర్శన్…
భువనగిరి డిప్యూటీ తహశీల్దార్ … కళ్యాణ్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భారత రాజ్యాంగం ప్రకారం కల్పించబడిన పౌర హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, భువనగిరి డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్ లు అన్నారు. గురువారం భువనగిరి మండలం అనాజీపురం గ్రామంలో జరిగిన పౌరహక్కుల దినోత్సవంలో వారు  ముఖ్య అతిథులుగా  పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం కుల వివక్ష ఉండరాదని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని కోరారు. గ్రామంలో ఆరోగ్యం, పరిశుభ్రత, పిల్లల రక్షణ, పిల్లల చదువులు, అమెరికా లాంటి విదేశాల్లో చదువుకొనే అవకాశాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పౌరహక్కుల దినోత్సవంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రమాదేవి, సోషల్ వర్కర్ కొడారి వెంకటేష్,  హెచ్ డబ్ల్యూ ఓ నాగ సైదులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి బట్టు స్వాతి, గ్రామ మాజీ వార్డు సభ్యులు వెంకటేష్, గ్రామ హెల్పర్ ,గ్రామ ఆశా వర్కర్లు బోగ పుష్ప, మైలారం పద్మ, ఎం ఎల్ హెచ్ పి విజయ, గ్రామ ప్రజలు బొల్లేపల్లి మల్లయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు తెల్జీరి వెంకటేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -