నవతెలంగాణ – కామారెడ్డి
టి జి ఈ జే ఏ సి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల పాత పెన్షన్ సాధన కొరకై సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కామారెడ్డి ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. టి జి ఈ జే ఏ సి రాష్ట్ర చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ రావు లు సెప్టెంబర్ ఒకటవ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చిన సందర్భంగా కామారెడ్డి జిల్లా ఉద్యోగ జేఏసీ కామారెడ్డి జిల్లా చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తేదీ 01.09.2025 సోమవారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము కామారెడ్డి జిల్లా భవనము నందు ఉద్యోగులు,ఉపాద్యాయులు, పెన్షనర్లు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు నల్ల చొక్కా లేదా టీ షర్టు ధరించి నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల పాత పెన్షన్ సాధన కొరకై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
టి జి ఈ జే ఏ సి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల పాత పెన్షన్ సాధన కొరకై నిరసన కార్యక్రమమును ఉద్దేశించి టి జి ఈ జే ఏ సి చైర్మన్, టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ అనేది ఉద్యోగుల పాలిట పెను శాపంగా మారిందని, పెన్షన్ లేక ఉద్యోగులు ఆర్థిక భద్రత లేక వృద్ధ వయసులో ఇంకొకరి మీద ఆధారపడవలసి వస్తుందని, సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల 5 డి ఏ లు పెండింగ్ ఉన్నాయని ఆ ఉద్యోగుల పెండింగ్ డి.ఏ లతో పాటుగా, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగులకు అత్యంత అవసరమైన ఉద్యోగుల ఆరోగ్య కార్డులు లేక ఆర్థికంగా ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు. కావున హెల్త్ కార్డులు మంజూరు చేసి ఉద్యోగులను కాపాడుకోవాల్సిన భాద్యత ప్రభుత్వానిధి అని గుర్తుకు చేశారు. అంతే కాకుండా ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సి సత్వరమే 51 శాతం రిటైర్మెంట్ బెనిఫిట్ ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పాలిత పెను శాపంగా మరీనా సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి జి ఈ జే ఏ సి జనరల్ సెక్రటరీ, టీజీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు ఆర్ దేవేందర్, కో ఛైర్మెన్ ఆకుల బాబు, చింతల లింగం, డిప్యూటీ సెక్రటరీ, నాగరాజు, సాయిరెడ్డి, ఎల్లారెడ్డి, కో చైర్మన్లు హన్మంత్ రెడ్డి, రాజు,లింగం, బాణాల భాస్కర్ రెడ్డి, ముజిబోద్దీన్, నిజాం, ప్రభాకర్, బట్టు రాజు, అల్లావుద్దీన్, విట్ఠల్ రావ్,వైస్ చైర్మన్ లు పూర్ణ చందర్, మనోహర్, చక్రధర్, భూమయ్య, దేవరాజ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.