Monday, October 13, 2025
E-PAPER
Homeకరీంనగర్సుప్రీం చీఫ్ పై దాడిని ఖండిస్తూ నల్లజెండాలతో నిరసన

సుప్రీం చీఫ్ పై దాడిని ఖండిస్తూ నల్లజెండాలతో నిరసన

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
భారత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి బి ఆర్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ నల్లా జెండాలతో ఎమ్మార్పీఎస్ నాయకులు కలెక్టరేట్ ముందు నిరసన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్ పుట్ట రవి మాదిగ  మాట్లాడుతూ.. చీఫ్ జస్టిస్  మీద జరిగిన దాడి దళితుల మీద. ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద దాడిగానే భావిస్తున్నామని అన్నారు,ఈ దాడి మీద లోతైన విచారణ జరిపించి దాడి చేసిన రాకేష్ కిషోర్ ఫై దాడి వెనుకున్న శక్తులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. అదే విదంగా ఈ నెల 17న,మండల కేంద్రాలలో ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించే నిరసన కార్యక్రమం లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.

ఈ కార్యక్రమం లో  నాయకులు ఆవునూరి ప్రభాకర్ మాదిగ,  ఖానాపురం లక్ష్మణ్ మాదిగ, యెలగందుల బిక్షపతి మాదిగ, సావనపెల్లి రాకేష్ మాదిగ,  శోభరాణి,  కత్తెరపాక రవీందర్,  గుండ్రేడ్డి రాజు మాదిగ, ఆవునూరి లచ్చన్న మాదిగ,  సావనపెల్లి బాలయ్య మాదిగ, మంద రాజు మాదిగ, కొమ్ము రాజశేఖర్ మాదిగ,  తర్రె శంకర్ మాదిగ,  గడ్డరాసి భగవంత్ మాదిగ, కొమ్మెట రాజు మాదిగ,కొంకటి రమేష్ మాదిగ,  చుంచు మల్లయ్య మాదిగ,మునిగే శంకర్ మాదిగ, ఎడ్ల రవి మాదిగ,అవునూరి లచ్చన్న మాదిగ ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -