Sunday, March 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయెమెన్‌లో నిరసన ప్రదర్శనలు

యెమెన్‌లో నిరసన ప్రదర్శనలు

- Advertisement -

అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులకు వ్యతిరేకంగా నిర్వహణ

యెమెన్‌ : మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయిల్‌ చర్యలకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యెమెన్‌లోనూ ఆందోళనలు వెల్లువెత్తాయి. అమెరికా యుద్ధంతో ప్రభావితమైన ఇరాన్‌, పాలస్తీనా, లెబనాన్‌ దేశాలకు మద్దతుగా యెమన్‌లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సైనిక చర్యలకు ముగింపు పలకాలని డిమాండ్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చర్యలను ఆందోళనకారులు తీవ్రంగా ఖండించారు. కాగా సైనిక జోక్యానికి తాము సిద్ధంగా ఉన్నామని హౌతీ ప్రతినిధులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -