Thursday, September 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభారీ వర్షాలు, వరదల నష్టాలపై ప్రాథమిక నివేదిక ఇవ్వండి

భారీ వర్షాలు, వరదల నష్టాలపై ప్రాథమిక నివేదిక ఇవ్వండి

- Advertisement -

– అధికారులను ఆదేశించిన సీఎస్‌ రామకృష్ణారావు
– మార్చి వరకు సీఎస్‌ పదవీకాలం పొడిగింపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత శాఖల కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం సచివా లయం నుంచి ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్‌ కుమార్‌, వికాస్‌ రాజ్‌, సబ్యసాచి ఘోష్‌, ముఖ్య కార్యదర్శులు రాహుల్‌ బొజ్జ, రఘునందన్‌ రావు, శ్రీధర్‌, అడిషనల్‌ డీజీ మహేష్‌ భగవత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా సీఎస్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధానంగా నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌, సిరిసిల్ల, నిజామా బాద్‌ జిల్లాలు అధికంగా నష్టాన్ని చవి చూశాయనీ, వాటితో పాటు ఇతర జిల్లాల్లో కూడా గణనీయమైన నష్టం వాటిల్లిందని అన్నారు. ఆ నష్టాలకు సంబంధించి ప్రాథమి క నివేదికను వెంటనే సమర్పించాలన్నారు.

ఈ ప్రాథమిక నివేదిక లతో పాటు జరిగిన నష్టాలను తెలియజేసే ఫొటోలు, వీడియో క్లిప్పింగులు, పత్రికా క్లిప్పింగులు కూడా జతపర్చాలని సూచించారు. వివిధ శాఖల కార్యదర్శులు, సంబం ధిత జిల్లా కలెక్టర్లు నష్టాలపై పంపిన ప్రాథమిక నివేదికలను సంకలనం చేయాలని విపత్తుల నిర్వహణ శాఖను ఆదేశించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలకు దెబ్బ తిన్న రోడ్లు, చెరువులు, విద్యుత్‌ లైన్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరి ంచాలని రామ కృష్ణారావు ఆదేశించారు. వర్షాలు మరికొన్ని రోజులు వచ్చే అవకాశం ఉన్నందున మరింత అప్రమ త్తతతో ఉండాలని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు నిబంధనలను అనుసరించి ఎక్స్‌గ్రేషియా ను అందజేయాలని సూచిం చారు. సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిస్థాయిలో సమీక్షించనున్నందున సంబంధిత శాఖలన్నీ పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలపై పూర్తి నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

సీఎస్‌ పదవీకాలం మార్చి వరకు పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కె.రామకృష్ణారావు పదవీకాలాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆయన ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సీఎస్‌ సర్వీసును పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీని కోరింది. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును మరో ఏడు నెలలపాటు పొడిగిస్తూ గురువారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -