- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
రెండేళ్లలోపు చిన్నారులకు తల్లిపాలతో పాటు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను అందివ్వాలని ఐసీడీఎస్ (రామక్కపేట సెక్టార్) సూపర్వైజర్ స్వరూప అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలని సూచించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో బరువు తక్కువగా ఉన్న రెండేళ్లలోపు చిన్నారుల ఇళ్లను సందర్శించారు. పిల్లల వయసుకు తగ్గ బరువు ఉండాలని, అందుకు తగినంత పౌష్టికాహారం అందించాలన్నారు. ఆమె వెంట అంగన్వాడీ టీచర్లు సుజాత, పద్మ, కల్పన ఉన్నారు.
- Advertisement -