Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్షతగాత్రుడికి ఆర్థిక సాయం అందజేత

క్షతగాత్రుడికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు
ఆలేరు పట్టణానికి చెందిన నారాయణ సాయి బీటెక్ పరీక్షలు రాయడానికి హైదరాబాద్ కువెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆలేరు పద్మశాలి చేయూత సంస్థ సభ్యులు చిక్క శ్రావణ్ శనివారం హైదరాబాద్ లో అగస్త్య హాస్పటల్లో చికిత్స పొందుతున్న అతడిని కలిసి, ఆత్మస్థైర్యం నింపారు. త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అనంతరం బాదితుడి తల్లిదండ్రులకు రూ.21000 ఖర్చుల నిమిత్తం సహాయం అందించారు. వీరితోపాటు సభ్యులు గజ్జల రమేష్, చింతకింది బాలరాజు, డాక్టర్ చింతకింది మురారి, వంగరి శివకుమార్, బేతి బాలరాజు, పున్నం సోమరాజు, చింతకింది వెంకటేష్, ఎలగందుల దయాకర్ లతో కలిసి పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -