Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత

విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని పద్మాజి వాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి   పాయల్ అనే విద్యార్థి అనారోగ్యానికి గురి అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అదే పాఠశాలలో ఆంగ్లం బోధిస్తున్న బి రాజేశ్వర్ అనే ఉపాధ్యాయుడు మానవత దృక్పథంతో ఆలోచించి ఆమెకు వైద్య పరీక్షలకు తన వంతుగా రూ.2000 అందించినట్టు తెలిపారు. అలాగే అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టై ,బెల్టు అందించినట్టు కూడా తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ఎంతో మంచి పరిణామాన్ని కొనియాడారు. అలాగే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పాఠశాలకు రాకుంటే వారి ఇంటి వద్దకు వెళ్లి తీసుకొని వస్తారని తెలిపారు .నిరుపేదలకు సహాయపడు తున్నందుకు ఆయనకు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -