నవతెలంగాణ – రామగిరి
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను అందించడం అభినందనీయమని కమాన్పూర్ ఉమ్మడి మండల మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణ రెడ్డి అన్నారు. రామగిరి మండలం కల్వచర్ల గ్రామ పరిధిలోని శివరాం నగర్ లో ఆధ్య కంప్యూటర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా కంప్యూటర్ బేసిక్స్ లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శనివారం ఇనిస్టిట్యూట్ లో ఏర్పాటుచేసిన సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటరమణ రెడ్డి మాట్లాడారు. కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన తిమ్మరాజు వంశీ , హైదరాబాద్ లో కంప్యూటర్ సంస్థను నిర్వహిస్తూనే ఉమ్మడి కమాన్పూర్ రామగిరి మండలాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను అందించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మరాజు ప్రభాకర్ రావుతో పాటు ఇన్స్టిట్యూట్ ఇంచార్జ్ చంద్రకాంత్, ఇన్స్ స్ట్రక్టర్ బండారు వికాస్ తదితరులు పాల్గొన్నారు.