నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హైదరాబాద్ కు చెందిన శ్రేయోభిలాషి సేవా ట్రస్టు వారి ఆధ్వర్యంలో క్రీడ పరికరాల కిట్లను అందజేశారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు క్రికెట్, వాలీబాల్, షటిల్ కిట్లు విద్యార్థులకు అందచేశారు. పూర్వ విద్యార్థులైన శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు విష్ణు జగతి పటేల్, ఉపాధ్యక్షులు కీని గంగాధర్ పటేల్, అమరగోని రవీందర్ గౌడ్, సుంకరి మురళి, ట్రస్ట్ సభ్యులు తాము చదువుకున్న పాఠశాల విద్యార్థులకు స్ఫూర్తి దాయకంగా ఉండేలా తగిన తోడ్పాటు అందించాలని సదుద్దేశంతో క్రికెట్, వాలీబాల్, షటిల్ కిట్లు విద్యార్థులకు అందచేశారు.
పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం క్రీడ పరికరాల కిట్లను అందజేసిన పాఠశాల పూర్వ విద్యార్థులు, శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బోగ రామ స్వామి, వినోద్ గౌడ్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వేముల నాగభూషణం, ఉపాధ్యాయులు లక్ష్మినర్సయ్య, రమ కుమారి, మహేష్, పి.రాజేశ్వర్, రాజేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల విద్యార్థులకు క్రీడ పరికరాల కిట్లు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES