- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు సంబంధించిన ప్రొవిజనల్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది సెప్టెంబర్లో నోటిఫికేషన్ రాగా, నవంబర్ 10న పరీక్ష నిర్వహించారు. 24,045 మంది దరఖాస్తు చేసుకోగా, 23,323 మంది పరీక్షకు హాజరయ్యారు. మరుసటి రోజు ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. ఈ ఏడాది మార్చి 10న ఫైనల్ కీ, ఫలితాలను విడుదల చేశారు. ప్రొవిజనల్ లిస్టును విడుదల చేసిన నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు బోర్డు ప్రకటించింది.
- Advertisement -