మండల అధ్యక్షుడు రమేష్ కుమార్
నవతెలంగాణ – పెద్దవంగర
పాత పెన్షన్ సాధన కోసం సెప్టెంబర్ 1 ఇందిర పార్క్ వద్ద తలపెట్టిన పీఆర్టీయూ మహాధర్నా కు ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీ ఎత్తున తరలిరావాలని ఆ సంఘం మండల అధ్యక్షుడు గంగిశెట్టి రమేష్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ ప్రాంగణంలో ఎంఈవో బుధారపు శ్రీనివాస్ తో కలిసి మహాధర్నా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ.. 2004 నుండి అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ విధానంతో ఉద్యోగ ఉపాధ్యాయులకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, బాలరాజు, విద్యాసాగర్, నరసింహారావు, సింహాద్రి, జాటోత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్టీయూ మహాధర్నాకు తరలిరావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES