- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్‌లో PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది పిఎస్ఎల్‌వికి 64వ ప్రయోగం కాగా PSLV-DL వేరియంట్‌లో 5వ మిషన్. ఈ వాహక నౌక 44.4 మీటర్ల ఎత్తు, 260 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.
- Advertisement -



