నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజాపాలన ప్రగతి – ప్రణాళిక జిల్లా లో పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా ఉదయాదిత్య భవన్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ఉమ్మడి నల్లగొండ జిల్లా స్టాయి సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల పాటు చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికారులకు సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామస్థాయి,మండలస్థాయి,నియోజక వర్గ, జిల్లా స్థాయిలలో కార్యచరణ అమలు చేయడం జరిగిందని తెలిపారు.మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, ప్రభుత్వ కార్యాలయాలలో, మున్సిపాలిటీ,మండలం లో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరేలా చేయడం
జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయడం జరుగుతుందని తెలిపారు. వైద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని, అలానే ధాన్యం కొనుగోలు సీజన్ కూడా మొదలు అవుతున్నందున సజావుగా జరిగేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.ఇటీవల కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్స్, కార్పొరేటర్లు సర్పంచులను ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసేందుకు వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం తో పని చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ డివిజన్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి,జిల్లా గ్రామీనాభివృద్ది అధికారి నాగిరెడ్డి,వివిధ జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



