ప్రభుత్వ ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని కేసుపల్లి గ్రామంలో ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆయుర్వేద వైద్యాధికారి లలితా తెలిపారు. స్వస్థనారి స్వశక్తి భారత్ ప్రోగ్రాం మండలంలోని కేష్ పల్లి గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ పడకల్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరము నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ లలిత మహిళల ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ మాట్లాడారు.
గ్రామస్తులకు వివిధ వ్యాధులపై ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయుర్వేద వైద్య సేవలను పొందారు. మహిళల ఆరోగ్య సంరక్షణ అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ఓ మహేందర్ కార్యదర్శులు నర్సారెడ్డి ఏఎన్ఎం సుజాత ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఆరోగ్యకరమైన జీవన శైలిపై ప్రజలకు అవగాహన
- Advertisement -
- Advertisement -



