- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు, విద్యుత్ శాఖ ఆధ్వర్యములో ప్రతి మంగళ, గురు, శని వారాలలో ప్రజా బాట కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు స్వీకరించి, పరిష్కరించడం జరుగుతుంది. విద్యుత్ ఉపకరణాల వద్ద తీసుకునే జాగ్రత్తల గురించి తెలియజేయడం జరుగుతుంది. మొదటి మేనూర్ గ్రామములోచేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమములో మేనూరు విద్యుత్ శాఖ ఏఈ కె.రమేష్, విద్యుత్ సిబ్బంది, మేనూరు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



