Wednesday, November 19, 2025
E-PAPER
Homeఖమ్మంవైరా మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించాలి: సీపీఐ(ఎం)

వైరా మున్సిపాలిటీ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

వార్డుల వారిగా మున్సిపల్ అధికారులు పర్యటించి సమస్యలను పరిష్కరించాలి 
విద్య, వైద్య, విద్యుత్, సైడ్ డ్రైనేజ్, విది కుక్కల బెడదపై అధికారులు దృష్టి పెట్టాలి
సీపీఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సమావేశంలో డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
నవతెలంగాణ-వైరాటౌన్

వైరా మున్సిపాలిటీ పరిధిలో మౌలికమైన సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో పార్టీ పట్టణ నాయకులు పైడిపల్లి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శుల సమావేశంలో భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. అధికారుల పరిపాలనలో ప్రభుత్వం సక్రమంగా నిధులు కేటాయించకపోవడంతో విలీన గ్రామాలతో పాటు వైరాలో ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందటం లేదని, మౌళిక సౌకర్యాలు కల్పించడం లేదని, ప్రణాళిక బద్దంగా అభివృద్ధి జరగటం లేదని విమర్శించారు. విలీన గ్రామాల్లో అనేక ప్రాంతాలు పేదవాళ్లు నివాసం ఉంటున్న ఏరియాలో విద్యుత్తు కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందాలని గుర్తు చేశారు. సోమవారం దళితులు నివసిస్తున్న ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు వేశారు కానీ కనెక్షన్ ఇవ్వలేదని, పేదలు, దళితులు నివాస ప్రాంతాలపై 

అధికారుల వివక్షత చూపుతున్నారని విమర్శించారు. లాలాపురం, పల్లిపాడు, ప్రాంతాల్లో వర్షాకాలంలో వరద నీరు నిల్వ ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కనీసం మున్సిపాల్టీ అధికారులు కన్నేత్తి చూడలేదని, సిపిఎం ఆధ్వర్యంలో అనేకసార్లు సమస్యలను దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. బ్రాహ్మణపల్లి ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్ఫర్ కాలిపోయి ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవట్లేదని, వెంటనే అధికారులు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కుక్కలు, కోతుల బెడదతో ప్రజలు బెంబెలెత్తి పోతున్నారని, ప్రత్యామ్నాయం చూపకుండా అధికారులు ప్రజల ఫిర్యాదులను పట్టించుకోవట్లేదని, వెంటనే మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులలో కుక్కలు కోతుల బెడద నివారించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు అన్ని వార్డులు పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. సిపిఎం ఆధ్వర్యంలో అనేక సమస్యలపై ఆందోళన పోరాటాలు నిర్వహించామని, భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో ప్రజలందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, హరి వేంకటేశ్వరరావు, సంక్రాంతి నర్సయ్య, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, అనుమోలు రామారావు, తోట కృష్ణవేణి, కంసాని మల్లికాంబ, బెజవాడ వీరభద్రరావు, సంక్రాంతి పురుషోత్తమరావు, యనమద్ది రామకృష్ణ, పాపగంటి రాంబాబు,  ఎరువ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -