నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో గురువారం సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద, సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని, ఈనెల 18వ తేదీన ఖమ్మం జిల్లా కేంద్రంలో జరుగు బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ ఆ పార్టీ సభ్యులు గోడపత్రిక ఆవిష్కరించారు. 100 సంవత్సరాలలో భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటంలో రజాకాలను, నవాబులను, దేశముఖ్లను పారదోలి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత సిపిఐ పార్టీకి దక్కిందాని ఈ సందర్భంగా పార్టీ నాయకులు కొనియడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్, మండల కార్యద చౌడబోయిన కనకయ్య, నాయకులు తెడ్డు ఆంజనేయులు, స్వామి, పల్లె శ్రీనివాస్, కందుల మధు తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



