Monday, March 30, 2026
E-PAPER
Homeఖమ్మంవిద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ధర్నాకు ప్రజా సంఘాల సంఘీభావం

విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ధర్నాకు ప్రజా సంఘాల సంఘీభావం

- Advertisement -

– ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలి
– రైతు సంఘం నాయకుడు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు సోమవారం చేపట్టిన ధర్నా కు ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం స్థానిక ఎన్పీడీసీఎల్ సబ్ స్టేషన్ గుమ్మం ముందు సాగుతున్న ఆందోళనకు మద్దతుగా వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు పుల్లయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. వారి సేవలను క్రమబద్ధీకరించి, సముచిత వేతనాలు ఇవ్వాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికుల న్యాయ పోరాటానికి రైతు సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపాకుల శ్రీనివాస్,బి.చిరంజీవి,సోడెం ప్రసాద్,ముల్లగిరి గంగరాజు,తుట్టి వీరభద్రమ్, విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -