నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ప్రభుత్వ సోమ్మును, ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వృధా చేస్తున్నారని బ్రష్టచార్ నిర్మూలన సమితి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ ఆర్ దివేది అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత హోటల్లో అవినీతి నిరోధకం అనే అంశాల పైన ఆదివారం అవగాహన కార్యక్రమం బ్రష్టచార్ నిర్మూలన సమితి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె నయీముద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రష్టచార్ నిర్మూలన సమితి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ ఆర్ దివేది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మిషల్స్ మాన్ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అవినీతి అక్రమాల పైన అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులను అవినీతి అంశాలపై అవగాహన కల్పించారు. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు అనేక అవినీతిలకు పాల్పడుతు , ప్రజలను మభ్యపెడుతూ ప్రజల సొమ్ము ను విచ్చలవిడిగా వృధా చేస్తున్నా రని, ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ ఆస్తులను, స్థలాలను కబ్జా చేస్తున్నారు అని, ప్రజా క్షేత్రంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూన్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం రవీందర్, జిల్లా అధ్యక్షులు తురఫ్ ఖాన్, జిల్లా సెక్రెటరీ శ్రీనివాసరావు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ (హైదరాబాద్) సయ్యద్ నియామత్, తెలంగాణ పిఆర్ఓ మహమ్మద్ నజీర్, నిజామాబాద్ రీజియన్ పిఆర్ఓ ఏంఏ రషీద్, నిజామాబాద్ పిఆర్ఓ మహమ్మద్ రఫీ, షేక్ మసూద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు, తెలంగాణ మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొన్నారు.