- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 13 నుంచి యధావిధిగా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటం వల్ల తాత్కాలికంగా గత వారం ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని.. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయినందున, ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యధావిధిగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు.
- Advertisement -