బండ సోమారం సర్పంచ్ కాటిక జంగయ్య యాదవ్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజాసేవే పరమావధిగా బండ సోమారం గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేయడంతో డిసెంబర్ 14వ తేదీన జరిగిన ఎన్నికలలో నన్ను గెలిపించారని బండసోమారం సర్పంచ్ కాటిక జంగయ్య యాదవ్ అన్నారు. గత పది సంవత్సరాలుగా బండ సోమారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం గతంలోనే సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సర్పంచిగా గెలిపించినందుకు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెండవసారి సర్పంచ్ గా గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటాడని అన్నారు.
ప్రజా సేవే.. నన్ను మళ్లీ గెలిపించింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



