చెడు పాలన ప్రజలకు శాపం.
సిటిజన్ ఫోరం తెలంగాణ..
నవతెలంగాణ – బంజారా హిల్స్
చెడు పాలన ప్రజలకు శాపంగా మారిందని లంచాలతో ప్రజా సంక్షేమం మందగించి అభివృద్ధి కుంటుపడుతుందనీ జాన్ సేవ సంఘ్ హైదారాబాద్, అభిప్రాయ్ వారు సంయుక్తంగా,మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఐఆర్ఎస్ గోపీనాథ్, జన్సేవా సంఘ్ వ్యవస్థాపకులు వీడి చూబె, ప్రధాన కార్యదర్శి రాజీవ్ చూబే, అభిప్రాయ వ్యవస్థాపకులు ఎన్ఆర్ఐ రాజీవ్ కుమార్ లు మాట్లాడుతూ..లంచగొండితనం అవినీతి అధికారుల భరతం పట్టాలంటే వారిని తొలగించిన విధుల్లో తీసుకోకూడదని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం వలన తిరిగి మరొకరు లంచాలకు అలవాటు పడకుండా నిజాయితీగా పనిచేసి తమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని అన్నారు. లంచగొండితనం సమసి పోవాలంటే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని అందుకు తమ ఫోరం ముందుండి పోరాడుతుందని చిన్నచిన్న స్థాయి ఉద్యోగులు లంచగొండి అవతారం ఎత్తడం వలన సాధారణ ప్రజానీకానికి రోజువారి పనుల్లో జాప్యం జరిగి కార్యాలయాలు చుట్టూ తిరిగి అలసిపోయి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నా వార్త కథనాలు కోగొల్లలుగా వస్తున్నయన్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే కిందిస్థాయి సిబ్బంది నుండి గ్రూప్ త్రీ నుండి గ్రూప్ వన్ స్థాయి అధికారులు ప్రజలకు నిత్యం అందించే వెసులుబాటుల కొరకు లంచాల పర్వాన్ని తగ్గించుకుంటేనే ప్రజా అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వినోద లక్ష్మి,మదన్లాల్ రావల్ లు పాల్గొన్నారు.