నవతెలంగాణ – డిచ్ పల్లి
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రీయలో బాగంగా శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు రాజ్ వీర్, అనంత రావు, యం.పి.ఓ. శ్రీనివాస్ గౌడ్, పాండు నాయక్ కార్యాలయ సిబ్బంది తో కలిసి ప్రచురణ చేశారు. డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల కేంద్రాల తోపాటు అన్ని గ్రామ పంచాయతిలకు చెందిన జడ్పిటిసి/ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించారు.
మండలంలోని అన్ని గ్రామ పంచయతిలలో జడ్పిటిసి/ఎంపిటిసి ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించమని, ఈనెల 8న రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నామని 10న ఫైనల్ ఓటర్ లిస్ట్, పోలింగ్ స్టేషన్ లను ప్రచురించడం జరుగుతుందని ఎంపీడీవోలు వివరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్లు లక్ష్మణ్, లింగం, సిబ్బంది నితీష్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES