నవతెలంగాణ – పెద్దవూర
పురం వేణు మృతి బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ ఓక మంచి కార్యకర్తను కోల్పోయామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. సోమవారం గుర్రంపోడు మండలం, కోయిరోని భావి గ్రామానికి చెందిన లక్ష్మీదేవిగూడెం తాజామాజీ యంపిటిసి హేమలత ముఖ్య సలహాదారుడుబిఆర్ఎస్ నాయకులు, పురం వేణుగోపాల్(వేణు) ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మరణించారు.
సోమవారంఉమ్మడి వారినివాసంలో వారి పార్ధీవ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడుతూయువ నాయకులు వేణు మృతి చాలా బాధాకరం అని అన్నారు. వారి మృతిపట్ల వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి,తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోమండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు, జిల్లా బిఆర్ఎస్ యువ నాయకులు రాజేష్ రెడ్డి, సైదిరెడ్డి, తెలంగాణ ఉద్యమ నాయకులు, తేనేపల్లి తండా తాజామాజీ సర్పంచ్ నాగరాజు నాయక్, పోచంపల్లి తాజా మాజీ సర్పంచ్ జాల మల్లేష్ యాదవ్, రామకృష్ణారెడ్డికృష్ణ గౌడ్, మండల ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
పురం వేణు మృతి బాధాకరం: ఎమ్మెల్సీ కోటిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES