నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలోని ఖుదావంద్‌పూర్ గ్రామంలో శుక్రవారం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ వాకిడి కార్తీక్ రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు తగిన తేమ శాతం ఉన్న, శుభ్రమైన ధాన్యాన్ని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరపాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. “రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని తెలిపారు.ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి మొక్కజొన్న గింజ, ప్రతి వరి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయబడుతుందని, రైతులు దళారుల మాయలో పడకుండా నేరుగా కేంద్రాల్లోనే విక్రయం చేయాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తోట మహేష్, సీఈఓ చిన్నయ్య, గ్రామాభివృద్ధి సంఘం అధ్యక్షులు భీమ మురళి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుక్కన్న, రైతులు పాల్గొన్నారు.