- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ఐజ మండలం ఉప్పల క్యాంపు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి మాదిగ సరోజమ్మ తన గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో గుడిసె సమీపంలో ఉన్న హై టెన్షన్ వైర్లు ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో అక్కడ మంటలు గుడిసె మీద పడటంతో గుడిసె పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఆర్ఐ రజినీకాంత్ రెడ్డి మంగళవారం పంచనామ చేసి బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. గ్రామ ప్రజలు హై టెన్షన్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని ప్రజావాణిలో విన్నవించుకున్నా కూడా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన ఈ సంఘటన జరిగిందని గ్రామస్తులు వాపోయారు. వీఆర్వో రహమతుల్లా, గ్రామపంచాయతీ సెక్రటరీ మంజుల ఉన్నారు.
- Advertisement -