Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ ఘాతంతో పూరి గుడిసె దగ్ధం

విద్యుత్ ఘాతంతో పూరి గుడిసె దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ – టేకుమట్ల  
విద్యుత్ వైర్లు తగిలి పూరి గుడిసె కాలిపోయిన సంఘటన మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం .. వెల్లంపల్లి గ్రామానికి చెందిన కట్ల రమేష్ కుటుంబంతో కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ గురువారం ఉదయం కూలి పనికి బయలుదేరే సమయంలో విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా పూర్తిగా కాలిపోయింది. గుడిసెలో ఉన్న బియ్యము, బట్టలు, నగదు రూ.50 వేల దగ్ధమై నా కుటుంబం రోడ్డున పడినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి మా కుటుంబానికి తక్షణ సాయం అందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బాధితులు, గ్రామస్తులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -