- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మండలంలోని గంగారం గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన వీణవంక దుర్గయ్య మమతా దంపతులు గుడిసెలో నివసిస్తూ హోటల్ నిర్వహిస్తున్నారు. దుర్గయ్య అయ్యప్ప మాలధారణలో ఉండటంతో ఉదయాన్నే ఇంట్లో పూజలు చేసి మాల విరమణ అనంతరం వారిద్దరు బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో నుండి మంటలు క్షణాల్లోనే ఇల్లంతా వ్యాపించాయి. దీంతో పూరి గుడిసె పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంతో ఇంట్లో ఉన్న నగదు రూ. 1లక్షతో పాటు మోటర్ సైకిల్, కుట్టు మిషన్, ఫ్రిజ్ ఇలా సుమారుగా రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు వారు తెలిపారు. ప్రభుత్వం స్పందించి మమ్ములను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



